
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగుల్లో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యానికి కొదవలేదని మందమర్రి ఏరియా డీజీఎం(వర్క్‌షాప్) నాగరాజు నాయక్ అన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా సింగరేణి వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిషన్ షాప్ పంపు సెక్షన్, ఎలక్ట్రికల్ సెక్షన్ ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహకాలను అందజేశారు.
సింగరేణి కార్మికవాడలకు గోదావరి నీరు సప్లై చేసే 125 హెచ్‌పీ పంపు అక్టోబర్ నెలలో విరిగి పనికిరాకుండా పోయిందన్నారు. మిషన్ షాప్ పంపు సెక్షన్ కార్మికులు ఏ విధమైన ఓటి ఆశించకుండా రిపేర్లు చేసి వాటర్సప్లైకు కృషి చేశారన్నారు. 150, 125 హెచ్‌పీ మోటర్ల లెగ్స్ విరిగి పనికిరాకుండా పోతే ఎలక్ట్రికల్సెక్షన్ ఉద్యోగులు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. కార్యక్రమంలో భీమనాధుని సుదర్శనం, తిరుపతి, పెద్దపల్లి బాణయ్య, కృష్ణరెడ్డి, నాగుల శ్రీనివాస్, సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.