- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్
కోల్బెల్ట్, వెలుగు : వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు సప్లయ్చేసినప్పుడే సింగరేణి సంస్థకు మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓపెన్కాస్ట్గనిపై మల్టీ డిపార్ట్మెంటల్కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ ఓసీపీల్లో మిషన్ల కెపాసిటీని పూర్తిస్థాయిలో వినియోగించుకొని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా చేయాలన్నారు.
కంపెనీ భవిష్యత్నిర్దేశిత టార్గెట్చేరుకోవడంపై ఆధారపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్, కమిటీ కన్వీనర్,ఏరియా ఏస్ఓటుజీఎం రాజేశ్వర్రెడ్డి, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆర్కే1ఏ గని సమీప పాలవాగు ఒడ్డున నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను వేగవంతం
చేయాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి జాతర ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.