- జీఎం జి.దేవేందర్
- కేకే డిస్పెన్సరీలో సెల్ కౌంట్ కేంద్రం ప్రారంభం
కోల్‌బెల్ట్, వెలుగు: పిల్లల పెంపకంపై మరింత అవగాహన పెరగాలని, అల్లరి మాన్పించేందుకు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ సూచించారు. మందమర్రిలోని సింగరేణి కేకే డిస్పెన్సరీలో రక్త పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సెల్ కౌంట్ సెంటర్, వెల్ బేబీ షోను జీఎం దేవేందర్, స్వరూపారాణి దంపతులు శుక్రవారం ప్రారంభించారు. పిల్లలు సెల్ఫోన్లకు అలవాటు పడటంతో శారీరకంగా, మానసికంగా ఎదగలేరన్నారు.
వెల్‌బేబీ షో కార్యక్రమం వల్ల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, వారి మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సింగరేణి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్యామల, ఏస్వోటుజీఎం విజయ్‌ప్రసాద్, పర్సనల్మేనేజర్ శ్యాంసుందర్, కేకే డిస్పెన్సరీ డీవైసీఎంవో డాక్టర్ కె.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.