సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం

సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్  ఫ్లెక్సీలకు  పాలాభిషేకం

 రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అంగడి బాజర్ రేషన్ షాపులో లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం నిరుపేదల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు. రేవంత్ ప్రజాపాలన అందిస్తున్నారని చెప్పారు. 

ALSO READ | ఇంద్రవెల్లి సభను సక్సెస్​ చేయాలి : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే..ఉగాది సందర్భంగా నల్గొండ జిల్లా హుజూర్‌‌నగర్‌‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ స్కీమ్‌ను ప్రారంభించారు. పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సభా వేదికపైన సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనుంది.