
కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వేగేట్‌ను శుక్రవారం ఓపెన్ చేశారు. రైల్వే ట్రాక్ రిపేర్కారణంగా ఈనెల 19 నుంచి 28 వరకు గేట్‌ను మూసివేస్తున్నట్లు రైల్వే ఆఫీసర్లు ప్రకటించారు. అయితే, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడతారని కాంగ్రెస్నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన వారు దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్ల తో మాట్లాడారు. పరీక్షలు పూర్తయ్యేవరకు రైల్వే ట్రాక్మరమ్మతులు నిలిపివేయాలని సూచించడంతో గేట్ఓపెన్ చేశారు. టీపీసీసీ జనరల్సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు గాండ్ల సమ్మయ్య ఎంపీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.