
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు నిజామాబాద్ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వేంకటేశ్వరరావు. ప్రగతి భవన్ లో ఇవాళ కేసీఆర్ ను కలిసిన ఆయన… టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
మండవ వేంకటేశ్వరరావుతోపాటు… కాంగ్రెస్ నాయకుడు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీపడిన కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్రను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేసీఆర్.
పార్టీకోసం అంకితభావంతో పనిచేయాలని… సేవకు తగిన గుర్తింపు దక్కేలా చూస్తానని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు.
నిన్న మధ్యాహ్నం మండవను ఆయన ఇంట్లో కలిసిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఆ తర్వాత వేంకటేశ్వరరావు సాయంత్రం ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు.