హైదరాబాద్, వెలుగు: మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేస్తూ, ప్రోత్సహిస్తున్నందుకు మంగ శ్రీనివాస్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్లిమిటెడ్ పోషక్ అనాజ్ అవార్డ్స్ 2024లో 'యంగ్ మిల్లెట్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీ అవార్డును అందుకుంది. ఇంటర్నేషనల్ న్యూట్రి-సీరియల్ కన్వెన్షన్లో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి మంగ శ్రీనివాస్ ఫుడ్స్ సీఈఓ, ఎండీ మణిదీప్ కావలికి అవార్డు అందజేశారు.
న్యూట్రిహబ్, ఐసీఏఆర్, - ఇండియన్ ఇన్ డిగ్రీ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ తన ఈట్ ఫుల్ బ్రాండ్ ఎనర్జీ బార్స్, కుకీస్ ద్వారా పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించిందని మణిదీప్ చెప్పారు. అంతర్జాతీయ చిరుధాన్యాల ఆధారిత వంటకాలను అభివృద్ధి చేయడానికి పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు.