న్యూఢిల్లీ : ట్రాన్స్‌ఫార్మర్ కాంపోనెంట్లను తయారు చేసే మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఐపీఓ మార్గంలో రూ.450 కోట్లు సేకరించేందుకు రెడీ అవుతోంది. ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ లేదు.
ఐపీఓకి ముందు రూ.90 కోట్లను సేకరించాలని కూడా ఆలోచిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో రూ.122 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.120 కోట్లను రాజస్థాన్ ప్లాంట్‌ను విస్తరించడానికి, రూ.96 కోట్లను స్టోరేజ్ కెపాసిటీ పెంచేందుకు వాడనుంది.
ట్రాన్స్‌ఫార్మర్లలో వాడే కాయిల్స్, సర్క్యూట్ బ్రేకర్లు వంటివి ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ.97.87 కోట్లుగా ఉంది. 2023–24 లో మంగళ్ ఎలక్ట్రికల్స్‌కు రూ.449.48 కోట్ల రెవెన్యూ రాగా, రూ.24.74 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది.