RX100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్(Payal rajput) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaarasm). రూరల్ హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపంచారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్ లో రిలీజైంది.
మొదటి షో నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. దాంతో ఏపీ, నైజాం, ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ.5 కోట్ల షేర్.. రూ.8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తోంది.
ఇక సినిమాకు ఓవర్ ఆల్ గా సూపర్ హిట్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం వీకెండ్స్ లో బాక్సాఫీస్ దగ్గర భూములేపనుంది ఈ సినిమా. తెలుగులో కూడా ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ వీక్ వరకు మంగళవారం హవా కొనసాగనుంది.
ఇక మంగళవారం బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.30 కోట్ల వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది కాబట్టి రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టనుంద అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మంగళవారం మూవీ ఓవర్ అల్ గా ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేయనుందో చూడాలి.