ఆర్ఎక్స్100(RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో.. పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read :- విజయ్ చివరి చిత్రం అదే.. దర్శకుడు ఎవరో తెలుసా?
టీజర్ మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు అజయ్ భూపతి. డైలాగ్స్ ఎక్కువ లేకుండా కేవలం విజువల్స్ తోనే ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. ఆరతితోటలో చనిపోయి పడిఉన్న జంటతో మొదలైన ఈ టీజర్.. పాయల్ భయంకరమైన అరుపుతో ఎండ్ అయ్యింది. మధ్యలో అంతా.. ఆకాశంలో జరుగుతున్న ఎదో వింతను చూస్తున్న జనాలను చూపించారు. ఈ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ టీజర్ కు మెయిన్ హైలెట్ అంటే అంజనీష్ లోకనాథ్(Ajaneesh Loknath) బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ అని చెప్పాలి. విజయ్ భూపతి విజువక్స్ కు అదిరిపోయే బీజీఎమ్ ను సెట్ చేశాడు అంజనీష్.
ఈ టీజర్ కు ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి రిలీజ్ తరువాత ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.