హైదరాబాద్, వెలుగు: మాంగళ్య షాపింగ్ మాల్ తన 20వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఓపెన్ చేసింది. దీనిని సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు. ఈ కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు, కిడ్స్, ఎత్నిక్ వెర్ మెన్స్ అండ్ ఉమెన్స్, వివాహాది శుభకార్యములకు ప్రత్యేక వస్త్రాలు మాంగళ్య షాపింగ్ మాల్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
షాపింగ్ మాల్ డైరెక్టర్లు పీఎన్ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 20 స్టోర్‌లు ప్రారంభించామన్నారు. మరో వారంలో హైదరాబాద్‌లోని నార్సింగ్, మణికొండలో కొత్త స్టోర్లు ప్రారంభిస్తామని వివరించారు.
త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా తమ స్టోర్లను విస్తరిస్తామని, తమను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత మగ్గాలపై తయారు చేయడంతో వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందించగలుగుతున్నామని అన్నారు.