గండిపేట్, వెలుగు: మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్‌ను శుక్రవారం నార్సింగిలో సినీనటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్‌తో, నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్గా మాంగళ్య అవతరించిందన్నారు. నార్సింగిలో ఏర్పాటు చేసిన స్టోర్‌ను తాను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పట్టు, ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు కొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
షాపింగ్ మాల్ డైరెక్టర్లు పీఎన్.మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్‌లు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 21 స్టోర్లు ప్రారంభించామన్నారు. ఆదివారం మణికొండలో మరో మాల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో స్టోర్స్‌ను విస్తరిస్తామని చెప్పారు. వస్త్రాలను సొంత మగ్గాలపై తయారు చేయడం వల్లే వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందించగలుగుతున్నామన్నారు.