రోడ్డు వేయలేదు.. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

రోడ్డు వేయలేదు.. ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

సుజాతనగర్, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మంగపేట వద్ద కొత్తగా నిర్మించిన ఆర్అండ్ బీ బ్రిడ్జికి అండర్ పాస్ నిర్మించలేదని, అందుకే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ గ్రామస్తులు బ్యానర్ కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భద్రాచలం రోడ్డు–సత్తుపల్లి రైల్వే లైన్ వేపలగడ్డ గ్రామం నుంచి వెళ్తోంది. ఇందుకోసం ఆర్అండ్ బీ ఫ్లై ఓవర్ నిర్మించారు. 

రైల్వే ట్రాక్ నుంచి 800 మీటర్ల వరకు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. సరిగ్గా బ్రిడ్జి పూర్తయ్యే ప్రాంతంలో మంగపేటకు వెళ్లే రోడ్డు ఉండడంతో బ్రిడ్జి చివరన డివైడర్ లేదా అండర్ పాస్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. గ్రామస్తులు వినతులను పట్టించుకోని అధికారులు దాదాపుగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో మంగపేట నుంచి కొత్తగూడెం వెళ్లడానికి రెండు కిలోమీటర్ల దూరం పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ తీరుకు ఆగ్రహించిన గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.