దీక్షలోకి మంగిరాములు మహారాజ్

నందిపేట, వెలుగు:  మండల కేంద్రానికి చెందిన కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్​ మంగళవారం దీక్షలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా హాజరయ్యారు. ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్​రెడ్డి హాజరయ్యి మహారాజ్​ ఆశీస్సులు తీసుకున్నారు. గత 38 సంవత్సరాలుగా విజయదశమి రోజున దీక్షలోకి వెళ్లి కార్తీకపౌర్ణమి రోజున దీక్షను విరమించడం ఆనవాయితీగా వస్తుంది.

దీక్ష కాలంలో ఎటువంటి అన్నపానీయాలు ముట్టకుండా 34 రోజుల పాటు దీదీక్ష కొనసాగిస్తారు. నవంబర్​ 26 కార్తీకపౌర్ణమి రోజు న దీక్ష విరమిస్తారు. 27 న ఆలయ కమిటీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమం, జతర నిర్వహించబడుతుంది.