సానో (జపాన్): టీ20 క్రికెట్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. జపాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మంగోలియా కేవలం 12 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో రెండో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. గతేడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్స్ టీమ్ 10 రన్స్‌కే కుప్పకూలింది. ఓవరాల్‌గా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో జపాన్ 205 రన్స్ తేడాతో మంగోలియాను చిత్తు చేసింది. టాస్ నెగ్గిన జపాన్ 20 ఓవర్లలో 217/2 స్కోరు చేసింది. సబోరిష్ రవిచంద్రన్ (69), కెండెల్ ఫ్లెమింగ్ (32), ఇబ్రహీం తకహషి (31) రాణించారు.
తర్వాత మంగోలియా 8.2 ఓవర్లలో 12 రన్స్‌కే ఆలౌటైంది. టుర్ సుమయ (4) టాప్ స్కోరర్. నమ్సారి బట్ (2), గాన్‌బోల్డ్ (2), ఒట్గోన్‌బయర్ (1)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు డకౌటయ్యారు. జపాన్ బౌలర్లలో స్టాఫోర్డ్ 5, అబ్దుల్ సమద్, మకోటో తనియమ చెరో రెండు వికెట్లు తీశారు. స్టాఫోర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.