మణిదీప్‌‌కు రెండు గోల్డ్ మెడల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ఇండియా ఓపెన్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తెలంగాణ షూటర్లు పతకాలు కొల్లగొట్టారు. మణిదీప్ జెట్టా, ఆర్సిటా కరార్‌‌ రెండు  గోల్డ్ మెడల్స్​తో మెరిశారు. గోవాలో జరిగిన ఈ టోర్నీలో మణిదీప్‌‌  50మీ రైఫిల్ 3 పొజిషన్స్‌‌ సీనియర్‌‌‌‌, జూనియర్ విభాగాల్లో  570 స్కోరుతో స్వర్ణాలు గెలిచాడు. ఆర్సిటా10 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో  విజేతగా నిలిచింది.

చెన్నుపల్లి  ప్రణతి  విమెన్స్‌‌ 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్‌‌  రజతం, జూనియర్ కేటగిరీలో కాంస్యం సొంతం చేసుకుంది.  రైయాన్‌‌ 50 మీ రైఫిల్ ప్రోన్‌‌ జూనియర్ ఫైనల్లో 580 స్కోరుతో టాప్ ప్లేస్‌‌ సాధింగా.. గోపాల కృష్ణ 10 మీటర్ల పిస్టల్‌‌లో కాంస్యం, శంకర్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్‌‌లో రజతం గెలిచారు.