తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్ ఠాక్రే

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్ ఠాక్రే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావ్ ఠాక్రే నియామకం అయ్యారు. ఈ మేరకు అదిష్టానం ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాగూర్ ను హైకమాండ్ గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. 1954 లో మహారాష్ట్రలో జన్మించిన మాణిక్‌రావ్ ఠాక్రే 1985 నుంచి 2004 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 15 వరకు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా వ్యవసాయ గ్రామీణాభివృద్ది, హోం శాఖ , విద్యుత్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.