అభివృద్ధి దిశగా కాంగ్రెస్​ మేనిఫెస్టో : శ్రీధర్ బాబు

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పేదల సంక్షేమం, అభివృద్ధి దిశగా కాంగ్రెస్​ మేనిఫెస్టో ఉండబోతుందని ఎన్నికల మెనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మేనిఫెస్టో కమిటీ పలు అంశాలపై పార్టీ నేతలో చర్చించింది. అనంతరం పలు కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మేనిఫెస్టో కమిటీకి తమ సమస్యలపై వినతులు అందజేశాయి. అనంతరం శ్రీధర్​ బాబు మాట్లాడుతూ రేషన్ షాపుల్లో తమ ప్రభుత్వ హయాంలో తొమ్మిది వస్తువులు ఇచ్చే వారిమని,  ఇప్పుడు అవి పక్కన బెట్టారన్నారు.  

ALSO READ : టీచర్ల మౌన దీక్ష ఉద్రిక్తం .. 13 జిల్లాల్లో స్పౌజ్‌‌‌‌ బదిలీలు చేపట్టాలని డిమాండ్‌‌‌‌

ప్రభుత్వ ఖర్చు, వచ్చే ఆదాయం రెండు బెరీజు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేలా మేనిఫెస్టోను తయారు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్లూరి సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీలు గోక గణేశ్​రెడ్డి, మల్లెపూల నర్సయ్య పాల్గొన్నారు.