ఎన్నికల ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలి : మణిగండసామి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఎన్నికల ప్రచార ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు మణిగండసామి అన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌లో కలెక్టర్ అనురాగ్‌‌‌‌జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్‌‌‌‌తో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదుకు ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్‌‌‌‌, వీడియో సర్వేలెన్స్‌‌‌‌, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ టీంల పనితీరును కలెక్టర్, ఎస్పీ.. ఎన్నికల వ్యయపరిశీలకుడికి వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షలే ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన  కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  ఎన్.ఖీమ్యా నాయక్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్‌‌‌‌అధికారి రామకృష్ణ, అధికారులు స్వప్న, దశరథం, పీబీ శ్రీనివాస చారి, రఫీ, వినోద్, సాగర్, నర్సింహులు పాల్గొన్నారు. 

ఎన్నికల రూల్స్‌‌‌‌ పాటించాలి

గోదావరిఖని, వెలుగు : చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ల వద్ద తనిఖీల్లో ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ రూల్స్​పాటించాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ముజమ్మిల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ సూచించారు. శనివారం గోదావరిఖనిలోని గోదావరి నది బ్రిడ్జి వద్ద స్టాటిక్‌‌‌‌‌‌‌‌ సర్వేలెన్స్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ చెక్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌ వద్ద సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ అధికారులు, స్టాటిక్ సర్వేలైన్స్ టీంలు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. తనిఖీల్లో జప్తు చేసిన నగదును రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి సంబంధిత వ్యక్తులకు రసీదు అందజేయాలన్నారు.