మంత్రివర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటివ్వాలి : మానిక్ డోంగ్రే

మంత్రివర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటివ్వాలి : మానిక్ డోంగ్రే

కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు కల్పించాలని ఆసిఫాబాద్ జిల్లా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఆర్గనైజేషన్ కన్వీనర్ మానిక్ డోంగ్రే ప్రభుత్వాన్ని కోరారు.

 రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా కలిగిన రెండో సామాజిక వర్గంగ ఉన్న మాలలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. త్వరలో చేబట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.