తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పని అయిపోయిందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మాణికం ఠాగూర్ అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంభించారని ఆరోపించారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ లో జరగబోయే రాహుల్ సభతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ..రాష్ట్రంలో హస్తంపార్టీ అధికారంలోకి వచ్చాక 2024లో మళ్లీ సోనియా వరంగల్ కు వస్తారన్నారు.