మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన భార్య ప్రతి రోజు లంచం తీసుకోనిదే ఇంటికి రాదంటూ ఆమె భర్త ఆరోపిస్తున్నారు. లక్షలు లక్షలు డబ్బు తెస్తుందని.. మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి లంచం తీసుకుంటుందని చెప్పాడు. దివ్యజ్యోతి లంచాలకు ఇవే సాక్ష్యాలంటూ ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపిస్తూ వీడియో విడుదల చేశాడు దివ్యజ్యోతి భర్త. అవినీతి సొమ్ము వద్దని చెప్పినా తన భార్య వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకోకపోవడం వల్లే వల్లే ఈ వీడియోలు మీడియాకు పంపించానని చెప్పాడు. రోజుకు 20 నుంచి 30 లక్షలు ఇంటికి తీసుకొస్తుందన్నాడు.
Also Read :- యువతలో గుండె జబ్బులు.. పెరగటానికి కారణాలు
గత వారం రోజుల కింద పుప్పాలగూడలో దాదాపు రెండు కోట్లతో అపార్ట్ మెంట్ కొనుగోలు చేసిందని ఆరోపించాడు దివ్యజ్యోతి భర్త. 30 లక్షలు పెట్టి ఇంటీరియర్ వర్క్ చేయిస్తుందని వెల్లడించారు. తమ్ముళ్లతో కలిసి దివ్యజ్యోతి తనను దూరంపెట్టిందని.. తన కొడకును కూడా చూడనివ్వకుండా చేస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు.