చిత్రపురి కాలనీలో225 విల్లాలకు నోటీసులు

  • వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు తప్పవని హెచ్చరిక

గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన 225 విల్లాలకు (రో హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. జీవో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 658(రెవెన్యూ)కి తూట్లూ పొడుస్తూ, జీవోకు విరుద్ధంగా 225 రో హౌస్​ల నిర్మాణాలు చేపట్టారన్నారు. 

గత సొసైటీ పాలకవర్గం జీప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1 అనుమతులు పొంది.. అక్రమంగా జీప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2 నిర్మాణాలు చేపట్టిందన్నారు. గత పాలకవర్గం దొంగచాటుగా అనుమతులు పొందినట్టు తేల్చారు. 15 రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలని కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. లేనిపక్షంలో కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేశారు.