
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ భద్రతా సిబ్బంది గాయపడ్డాడు. కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిరాబామ్ ప్రాంతంలో రేపు అనగా జూన్ 11వ తేదీన సీఎం పర్యటించనున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన భద్రతా సిబ్బందిపై మిలిటెంట్లు దాడి చేశారు.
కాగా జిరాబామ్ లో ఇటీవల మిలిటెంట్లు 70కి పైగా ఇళ్లకు నిప్పుపెట్టారు. వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం నుండి పారిపోయారు. జూన్ 6న గుర్తుతెలియని దుండగులు ఒక వ్యక్తిని హత్య చేయడంతో గత కొద్ది రోజులుగా అశాంతి నెలకొని ఉన్న జిరిబామ్‌ను సందర్శించాలని సీఎం అనుకున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం బీరేన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇంకా ఇంఫాల్‌కు చేరుకోవాల్సిఉన్నది.