మణిపూర్ ప్రజలకు సీఎం బిరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. గత కొన్ని నెలలుగా మణిపూర్ లో కొనసాగుతున్న హింసకు ప్రజలను నన్ను క్షమించాలని కోరారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షోభంపై విచారం వ్యక్తం చేశారు. 2023 మే నుంచి ఈ ప్రాంతంలో నెలకొన్న గందరగోళానికి మణీపూర్ ప్రజలకు సారీ చెప్పారు.
ఈ ఏడాది మొత్తం హింసాత్మతక ఘటనలు చాలా దురదృష్టకరం.. నేను ప్రశ్చాత్తాపడుతున్నాను. గతేడాది మే నుంచి జరిగిన పరిమాణాలకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని మంగళవారం (డిసెంబర్ 31) చెప్పారు.
గత మూడు నెలలుగా మణిపూర్ కొంత శాంతి వాతావరణ కనిపిస్తోంది.. 2025కలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నానని బీరేన్ సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రజలను గతాన్ని మర్చిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించానలని కోరుకుంటున్నాన్నారు.
2023మే లో మణిపూర్ లో రెండు తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లోయలోని మైటీ, తెగ, కొండల్లోని కుకీ జో తెగల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఘర్షణలు ముదిరి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. 2024లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చి దాదాపు 250 మందికి పైగా మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలను నగ్నం ఊరేగించిన సంఘటనలు జరిగాయి. దాదాపు ఏడాదంతా తుపాకీ కాల్పుల మోతలతో మణిపూర్ అట్టుడికిపోయింది.
2024లో గ్రామస్తులపై జరిగిన దాడులతో మణిపూర్ లో హింస ప్రారంభమైంది. ఏప్రిల్ లో ఎన్నికల సమయంలో హింస, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. జూన్ లో అసోం సరిహద్దుల్లో జరిగిన హింసతో మణిపూర్ సంక్షోభం మరింత ముదిరింది. ఇది జాతి హింసకు దారి తీసింది. వరుస బాంబు దాడులు, రాకెడ్ దాడులతో మణిపూర్ దద్దరిల్లింది. దాడులతో మణిపూర్ ప్రజలు భయం గుప్పిట్లో బతికారు.
అల్లర్ల క్రమంలో మణిపూర్ లో శాంతిని నెలకొల్పడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఏడాది కాలంలో మణిపూర్ లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ స్పందించకపోవడంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కొత్త సంవత్సరంలో మణిపూర్ లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని.. ఐక్యత ద్వారా మణిపూర్కోలుకోగలదని సీఎం బీరేన్ సింగ్ అన్నారు. ఈ సంవత్సరం మొత్తం మణిపూర్లో హింసకు క్షమాపణలు చెబుతున్నాను.. మణీపూర్ ప్రజలు గతాన్ని మర్చిపోయి శాంతియుత, సుసంపన్నమైన మణిపూర్ నెలకొలపాలని ప్రజలను కోరారు.