![మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా](https://static.v6velugu.com/uploads/2025/02/manipur-cm-n-biren-singh-resignsjpg1_UXqd6cOPrR.jpg)
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తన రాజీనామా లేఖను అందజేశారు. గత కొంతకాలంగా మణిపూర్ లో చెలరేగుతోన్న అల్లర్లు, హింసాత్మక ఘటనలతో బీరెన్ సింగ్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అల్లర్లను కట్టడి చేయడంలో బీరెన్ సింగ్ విఫలమయ్యారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
మరో వైపు కాంగ్రెస్ కూడా బీరెన్ సింగ్ పై ఫిబ్రవరి 10 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్దమైంది. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ ఫిబ్రవరి 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా,పలువురు అగ్రనేతలను కలిశారు. అగ్ర నేతల భేటీ అనంతరం బీరెన్ సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 9న తన పదవికి రాజీనామా చేశారు.