మణిపూర్ అల్లర్ల బాధ్యులను ఉరి తీయాలి: విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలు యావత్తు దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు.  ఈ ఘటనలతో ప్రమేయం ఉన్న వారు ఎవరైనా సరే వారిని ఉరి తీయాల్సిందేనని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు.మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలు యావత్తు దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు.  ఈ ఘటనలతో ప్రమేయం ఉన్న వారు ఎవరైనా సరే వారిని ఉరి తీయాల్సిందేనని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు.

ALSO READ :అవార్డు వాపస్ ఇవ్వబోమని హామీ ఇవ్వాల్సిందే