![కోకాపేట్లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..](https://static.v6velugu.com/uploads/2023/07/Manish-Reddy-incident-in-Kokapet_YdnCWpbfqN.jpg)
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కోకాపేట్ లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు.
కోకాపేటలో మనీష్ రెడ్డి అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. అయితే మనీష్ రెడ్డి ఎంతకీ గది నుండి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టారు. మనీష్ రెడ్డి ఫ్యాన్ కు వ్రేలాడుతూ కనిపించడం తో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మనీష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనీష్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.