ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆప్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ కు, సుప్రీంకోర్టుకు కృతజ్ణతలు తెలిపారు.
మరోవైపు ఆప్ నేతలు బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఆప్ పార్టీపై కుట్రలు చేసిందని..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్వశక్తు ఒడ్డిందన్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. నేతలను జైల్లో పెట్టి ఆప్ పార్టీ ని లేకుండా చేయాలని బీజేపీ చేస్తోందని.. ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో లేకుండా చేయాలని కుట్రలు చేస్తోందని సిసోడియా ఆరోపించారు.
ALSO READ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 2024, సెప్టెంబర్ 13న బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించింది సుప్రీంకోర్టు.