జంగ్‎పురాలో మనీష్ సిసోడియా ఓటమి

జంగ్‎పురాలో మనీష్ సిసోడియా ఓటమి

న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్ పురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. బీజేపీ క్యాండిడేట్ తర్వీందర్ సింగ్ 600కు పైగా ఓట్లతో తేడాతో మనీష్ సిసోడియాపై విజయం సాధించారు. జంగ్ పురా ఫలితం తొలి నుంచి ఉత్కంఠ భరితంగా సాగింది. రౌండ్ రౌండ్‎కు ఆప్, బీజేపీల మధ్య అధిక్యం దోబుచులాడింది. 

కౌంటింగ్ మొదట్లో బీజేపీ అభ్యర్థి అధిక్యం కనబర్చగా.. మధ్యలో మనీష్ సిసోడియా లీడింగ్‎లోకి వచ్చారు. ఇలా ఇద్దరి మధ్య అధిపత్యం అటు ఇటు చేతులు మారగా.. చివరకు బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ జంగ్ పురాలో విజయం సాధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 17 నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మనీష్ సిసోడియాకు ఆ సానుభూతి కలిసి రాలేదు.  ఓటమి అనంతరం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. 

Also Read :- ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ లైవ్ అప్డేట్స్

తన ఓటమిని అంగీకరిస్తున్నానని.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని పేర్కొన్నారు. అలాగే.. తనపై విజయం సాధించిన  బీజేపీ అభ్యర్థికి మనీష్ సిసోడియా శుభాకాంక్షలు తెలిపారు. ఇక,  మనీష్ సిసోడియాతో పాటు మరి కొందరు ఆప్ అగ్రనేతలు కూడా ఓటమి పాలయ్యారు. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. హస్తినాలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుంది.