న్యూఢిల్లీ: ప్రతి ప్రతిపక్ష నాయకుడూ కాబోయే ప్రధానమంత్రేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీశ్ తివారీ అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని చెప్పారు. జూన్ చివరలో రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. కాగా, రాహుల్‌గాంధీని కాబోయే ప్రధానిగా చూస్తున్నారా అని బుధవారం మనీశ్ తివారీని మీడియా ప్రశ్నించగా.. "ప్రతి ప్రతిపక్ష నాయకుడు వెయిటింగ్లో ఉన్న ప్రధానమంత్రే.
రాహుల్ గాంధీ ప్రసంగాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ప్రజల హృదయాలు, మనస్సులకు దగ్గరగా ఉండే సమస్యలపై ఆయన పోరాడుతున్నారు" అని తివారీ అన్నారు. ఇందుకు గత ఏడాది మణిపూర్ లాంటి ప్రదేశాలలో ఆయన చేసిన పర్యటనలే నిదర్శనమని తివారీ పేర్కొన్నారు.