రాజ్ తరుణ్ హీరోగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, శనివారం హీరోయిన్ ఫస్ట్ లుక్‌తో పాటు తన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోందని రివీల్ చేశారు. అలాగే క్యూట్ లుక్‌లో కనిపిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
మెట్లపై కూర్చోని ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్న ఆమెకు బ్యాక్‌గ్రౌండ్‌లో బటర్‌ప్లై ఎఫెక్ట్ పెట్టడం ఇంప్రెస్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపించనున్నారు. కృష్ణ భగవాన్, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, అమ్ము అభిరామి, లీలా శాంసన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.