హైదరాబాద్ సిటీకి నీటి సరఫరాలో కీలకమైన మంజీరా ట్రాన్స్ మిషన్ పైప్ లైన్ పగిలిపోయింది. గంగారం జీఆర్ టీ షాప్ దగ్గర ఉన్న మంజీరా మెయిన్ పైప్ లైన్ ఏప్రిల్ 5న రాత్రి పగిలిపోయింది. మెయిన్ పైప్ లైన్ కావడంతో భారీగా నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇవాళ ఉదయం కూడా నీళ్లు వృధాగా పోయాయి. ఆలస్యంగా స్పందించడంతో అప్పటికే చాలా నీరు వృధా అయింది. ఓ వైపు నగరానికి నీటి కష్టాలు ముంచుకు వస్తుంటే ట్రాన్స్ మిషన్ అధికారులు కనీసం స్పందించక పోవడం పట్ల ప్రజల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద కూడా ఇలాగే మంజీరా మెయిన్ లైన్ పైప్ లీకేజీ అయింది. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.