![మంజీరా నాలుగో కుంభమేళా షురూ](https://static.v6velugu.com/uploads/2023/04/Manjira-River-Maha-Kumbh-Mela-began-with-grandeur_hfE0dlCD5x.jpg)
సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు : మంజీరా నది నాలుగో మహాకుంభమేళా సోమవారం అంగరంగ వైభవంగా మొదలైంది. గరుడగంగా పుష్కరం సందర్భంగా నిర్వహించే ఈ కుంభమేళా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ -హుమ్నాపూర్ సిద్ధ సర్వస్వతీదేవి పంచవటి క్షేత్ర సన్నిధిలో 12 రోజులు పాటు జరగనుంది. దీనికి ఉత్తర భారతదేశం నుంచి నాగ సాధువులు, దిగంబర సాధుసంతులు, అఘోరాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదటిరోజు హోమం, గంగమ్మ తల్లికి బోనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్ రావు, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్శరత్, డీసీఎంఎస్ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్మల్కాపురం శివకుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఆలయ పీఠాధిపతి కాశీనాథ్‌బాబా, శివకుమార్ మహారాజ్ లు ఆలయం నుంచి గరుడ గంగా వరకు ఎద్దుల బండ్లు, రథాలపై ఊరేగింపుగా వెళ్లారు. అక్కడి నుంచి నది సమీపంలో గంగామాత ఆలయానికి చేరుకొని క్రేన్‌తో జెండా ఆవిష్కరించారు. మహారాష్ట్ర హళ్లందిరి శిక్షణ కేంద్రం నుంచి వచ్చిన స్టూడెంట్స్ చేసిన డ్యాన్సులు ఆకట్టున్నాయి. జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో కళాకారులు భక్తి పాటలను పాడారు. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన సాధువులు, పీఠాధిపతులతోపాటు భక్తులు భారీగాతరలివచ్చి
పుణ్యస్నానాలు చేశారు. ఉత్సవాల్లో ఉత్సవాల్లో మహారాష్ట్రలోని నగర్ కు చెందిన పీఠాధిపతి శంకర్ మహారాజ్, బీదర్‌కు చెందిన శివకుమార్మహారాజ్, కొండాపూర్ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్మహారాజ్ పాల్గొన్నారు.