మంజీరం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మూడో వార్షికోత్సవం.. ఆకట్టుకున్న అభినయం

మంజీరం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మూడో వార్షికోత్సవం.. ఆకట్టుకున్న అభినయం

బషీర్ బాగ్, వెలుగు: మంజీరం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మూడో వార్షికోత్సవాన్ని గురువారం కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్ లో ఘనంగా నిర్వహించారు. పద్మావతి పరిణయం, అన్నమాచార్య సంకీర్తనలతో చేసిన భరతనాట్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నాట్యంతో పిల్లలకు ఆధ్యాత్మికత ఆలోచనలు పెంచాల్సిన అవసరం ఉందని సంస్థ వ్యవస్థాపకురాలు సురాగ ప్రసాద్ ఈరవల్లి చెప్పారు. శాస్త్రీయ నృత్యాన్ని నేర్పించడంతోపాటు, వాటిలోని భావాన్ని తెలియజేయడమే తమ లక్ష్యం అన్నారు.