ఈమధ్య మలయాళ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడుతున్నాయి. ఇటీవల విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు, ఆతరువాత ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ వరుసలో వచ్చిన మరో మూవీనే మంజుమ్మల్ బాయ్స్. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో మిగతా భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు ఈ సినిమాను. అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. అయితే ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిన రెండు నెలలు గడుస్తున్న వేళ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, దేనిపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.
మంజుమ్మల్ బాయ్స్ సినిమాను మే 5న నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. మలయాళం తోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది ఈ సినిమా. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.