రన్ టైమ్: 2 గంటల 40 నిమిషాలు
నటీనటులు: నాగార్జున,రకుల్ ప్రీత్,వెన్నెల కిషోర్,లక్ష్మీ, రావు రమేష్,ఝాన్సీ,నిశాంతి తదితరులు
సినిమాటో గ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
మాటలు:కిట్టూ విస్సాప్రగడ,రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున,కిరణ్
కథనం,దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 9,2019
కథేంటి?
తను ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్లు కాదన్నారని..ఇక పెళ్లి చేసుకోకుడదని, లేట్ వయసులో లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు సామ్ (నాగార్జున) .కానీ వాళ్ల అమ్మ (లక్ష్మీ) బాధపడటం ఇష్టం లేక ఓ ప్లాన్ వేస్తాడు. అవంతిక (రకుల్ ప్రీత్) ను తన గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయమని పెళ్లి సమయానికి మోసం చేయమని చెప్తాడు.ఆ ప్లాన్ వర్కవుట్ అయిందా లేదా అనేది మిగతా కథ?
నటీనటుల పర్ఫార్మెన్స్:
నాగార్జున నటన గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ వయసులో కూడా గ్లామర్ గా కనిపిస్తూ ఎనర్జీ గా నటించాడు.తన మీద తనే పంచులేసుకున్నాడు.మాడ్రన్ గర్ల్ అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ గ్లామర్ ఒలకబోసింది.వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఎంటర్ టైన్ చేశాడు.తల్లి పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ బాగా చేసింది.రావు రమేష్ తన పాత్ర వరకు బాగా చేశాడు.ఝాన్సీ,నిశాంతి కొన్ని సీన్లల్లో విసిగించారు.
టెక్నికల్ వర్క్:
సుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది.పోర్చుగీస్ లోని అందాలను బాగా చూపించాడు.చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ డిజప్పాయింట్ చేసింది.సాంగ్స్ వినసొంపుగా లేకపోగా,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పించలేదు.ఇక ఆర్ట్ వర్క్ బాగుంది.ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండాల్సింది.కొన్ని పంచ్ డైలాగులు బాగానే పేలాయి.
విశ్లేషణ:
‘‘మన్మథుడు-2 ’’ 17 క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘‘మన్మథుడు’’ కు సీక్వెల్ కాకపోయినా ఈ కథలో కూడా హీరో రొమాన్స్ చేస్తాడని ఆ టైటిల్ పెట్టారట. కానీ ఆ మన్మథుడు పంచ్ డైలాగులతో ఎంటర్ టైన్ చేస్తే..ఈ మన్మథుడు అడల్ట్ కంటెంట్ తో వెగటు పుట్టించాడు..ఇందులో చూపించిన ఫ్యామిలీ ఎమోషన్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.అందువల్ల ఈ సినిమా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది.ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ వల్ల కాస్త ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ లో మొత్తం మిస్ ఫైర్ అయింది..కథ కూడా పాతది కావడం మైనస్.ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథను ఫ్రెంచ్ నుండి ఎందుకు కొనుకున్నారో అర్థం కాదు.రొటీన్ కథ,పసలేని కథనం వల్ల ‘‘మన్మథుడు 2’’ బోర్ కొడుతుంది. మొదటి సినిమా ‘చి.ల.సౌ’’ తో రైటర్ గా ,డైరెక్టర్ గా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డీల్ చేయడంలో గతి తప్పాడు.ఈ కథ అతనికి అదనపు భారంగా ఫీల్ అయినట్టు కనిపిస్తుంది..ఓవరాల్ గా ‘‘మన్మథుడు 2’’ కనీసం ఎంటర్ టైన్ చేయకపోగా..విసిగిస్తుంది.సెకండాఫ్ లో అయితే థియేటర్ నుండి వాకౌట్ చేయాలనిపిస్తుంది.