![15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి.. అప్పటికి అంత మెచ్యూరిటీ లేదు: మన్మథుడి బ్యూటీ కామెంట్స్](https://static.v6velugu.com/uploads/2025/02/manmadhudu-heroine-anshu-latest-comments-on-her-film-career_0ogYTpLIvx.jpg)
మన్మథుడు, రాఘవేంద్ర లాంటి చిత్రాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న అన్షు.. రెండు దశాబ్ధాల తర్వాత ‘మజాకా’ చిత్రంతో మళ్లీ తెలుగులోకి వస్తోంది. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈనెల 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అన్షు ఇలా ముచ్చటించింది.
‘‘మజాకా’ లవ్లీ స్టోరీ. కథ వింటూ చాలా ఎంజాయ్ చేశా. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. 23 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ తెరపై కనిపిస్తున్న సినిమా ఇది. యశోద అనే హెడ్ స్ట్రాంగ్ స్టబన్ విమెన్‌గా నటించా. తనకు ఎమోషనల్ పెయిన్ వుంటుంది. అది ఆ పాత్రలో కనిపిస్తుంది. ఆ పాత్రలో లీనం కావడానికి నా వంతు ప్రయత్నం చేశా. నా పర్ఫార్మెన్స్‌ని అందరూ ఇష్టపడతారనే నమ్మకం వుంది. ఫస్ట్ రోజు సెట్స్‌లో చాలా నెర్వస్ ఫీలయ్యా. అందరి సపోర్ట్‌తో రెండు రోజులకు అంతా కుదురుకుంది.
లండన్‌లో ఉంటున్న బ్రిటీష్ ఇండియన్‌ను కనుక తెలుగులో మాట్లాడటం ఛాలెంజ్‌గా అనిపించింది. నా వంతు ప్రయత్నం చేశా. సందీప్ కిషన్, రీతూతో మంచి స్నేహం ఏర్పడింది. మేం కొన్ని బుక్స్ షేర్ చేసుకున్నాం. రావు రమేష్ గారు చాలా సపోర్టివ్. డైరెక్టర్ త్రినాధరావుకు ఓపిక ఎక్కువ. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇక ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ క్యారెక్టర్స్ కోసం సంప్రదిస్తున్నారు. అందులో చాలా మదర్ రోల్స్ వున్నాయి.
అయితే కేవలం ఒకే తరహా పాత్రలు చేయాలని లేదు. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న క్యారెక్టర్స్ చేయాలని వుంది. ఇక నేను పదిహేనేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చా. అప్పటికి అంత ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. నా చదువు కూడా పూర్తి కాలేదు. దాంతో లండన్ వెళ్ళిపోయాను. అక్కడే కాలేజ్ చదువు పూర్తి చేసి మాస్టర్స్ చేశా. సైకాలజిస్ట్‌గా సొంతంగా క్లినిక్ పెట్టాను. 24 ఏళ్లకి సచిన్ సాగర్‌ని పెళ్లి చేసుకున్నా. ఇద్దరు పిల్లలు. బ్యూటీఫుల్ జర్నీ. ఇంట్లో వాళ్ల సపోర్ట్‌తో తిరిగి సినిమాల్లోకి రావడం హ్యాపీ’’.