హైదరాబాద్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్ తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అని అన్నారు.
మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు అని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు కేసీఆర్.
Also Read : భరతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు
కాగా, గురువారం (డిసెంబర్ 26) భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆర్థిక వేత్త, డైనమిక్ లీడర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.