స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం పురోగమనం చెందిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఫ్లెక్సీకి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారజోడు రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యాశిరీశ్రెడ్డి, కాంగ్రెస్‌జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు