పండుగలు వస్తున్నయ్.. కొవిడ్ రూల్స్ తప్పక పాటించాలె

న్యూఢిల్లీ: కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. నెలవారీ రేడియో కార్యక్రమం మన్‌ కీ బాత్‌లో మోడీ పాల్గొన్నారు. రానున్న నెలల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ అన్నారు. కరోనా రూల్స్‌ను తప్పకుండా పాటించాలని కోరారు. ‘పండుగలు రాబోతున్నాయి. మనం కొవిడ్‌తో యుద్ధాన్ని కొనసాగించాలి. వ్యాక్సినేషన్ విషయంలో అంతర్జాతీయంగా మనం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. ఈ సురక్షక కవచం నుంచి అందరకీ రక్షణ అందాలె. కరోనా రూల్స్‌ను అందరూ పాటించాలి’ అని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, అందర్నీ టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 

మరిన్ని వార్తల కోసం: 

పవన్.. అన్నింటికీ సమాధానం చెప్తా.. మంచు విష్ణుకు ఓటెయ్

బెదిరింపులు వచ్చినా మేం భారత్‌కు వెళ్లినం

జగన్ గారూ.. రాజకీయాలు పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీని కాపాడండి