పంజాబ్‌‌‌‌లో ఐదేండ్లు భగవంత్‌‌ మానే సీఎం: ఆప్ చీఫ్​ కన్వీనర్​ కేజ్రీవాల్‌‌

పంజాబ్‌‌‌‌లో ఐదేండ్లు భగవంత్‌‌ మానే సీఎం: ఆప్ చీఫ్​ కన్వీనర్​ కేజ్రీవాల్‌‌

చండీగఢ్‌‌: పంజాబ్‌‌లోని సీఎం భగవంత్‌‌ మాన్‌‌ ప్రభుత్వం ఐదేండ్లు పూర్తి చేసుకుంటుందని ఆప్‌‌ కన్వీనర్‌‌‌‌ అర్వింద్‌‌ కేజ్రీవాల్‌‌ అన్నారు. మాన్‌‌ను సీఎం పదవి నుంచి తొలగించనున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టేశారు. పంజాబ్‌‌లో డ్రగ్స్‌‌, అవినీతి పెద్ద సమస్యలని పేర్కొన్నారు. 

10 రోజులు విపాసాన మెడిటేషన్‌‌లో భాగంగా రాష్ట్రంలోని హోషియార్పూర్‌‌‌‌కు కేజ్రీవాల్‌‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారంతో పంజాబ్‌‌లో ఆప్‌‌ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా అర్వింద్‌‌ కేజ్రీవాల్.. ఆయన భార్య సునీత, సీఎం మాన్‌‌తో కలిసి అమృత్‌‌సర్‌‌‌‌లోని గోల్డెన్‌‌ టెంపుల్‌‌ను సందర్శించారు.