ఆస్టానా : హైదరాబాద్ షట్లర్ మన్నెపల్లి తరుణ్ తొలి ఇంటర్నేషనల్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. విమెన్స్ లో అనుపమ ఉపాధ్యాయ టైటిల్ నెగ్గింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 22 ఏండ్ల తరుణ్ 21–10, 21–19తో వరుస గేమ్స్‌లో ఎనిమిదో సీడ్ సూంగ్ జూ వెన్ (మలేసియా)ను ఓడించాడు.
విమెన్స్ సింగిల్స్ తుది పోరులో 19 ఏండ్ల అనుపమ 21–15, 21–16తో ఇండియాకే చెందిన ఇషారాణి బరూహపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సంజయ్ శ్రీవాస్తవ–కె. మనీషా జంట 21–9, 7–21, 12–21తో వాంగ్ టైన్ సి–లిమ్ చీవ్ సియెన్ (మలేసియా) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.