పారికర్ లేని పాలిటిక్స్!

ఇండియాపై పాకిస్థాన్ చేసిన పుల్వామా దాడికి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ బాలాకోట్’తో దిమ్మతిరిగేలా జవాబు చెప్పింది. అయితే గోవాలో లోక్ సభ సీట్లకు, 3 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎలక్షన్స్ లో ఈ ఎయిర్ స్ట్రైక్స్ ప్రభావం కమలదళానికి పెద్దగా కలిసి రాకపోవచ్చేమో. కేవలం వాటిపైనే ఆధారపడి, హిందువుల ఓటు బ్యాంకును మరచిపోతే ఆ పార్టీకి కష్టమే. హిందూ ఓట్లపై గోవా సురక్షా మంచ్ (జీఎస్ ఎం), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) కన్నేశాయి.గోవాలోని మొత్తం ఓటర్లలో హిందువులు 66 శాతం వరకు ఉన్నారు. బీజేపీతోపాటు జీఎస్ ఎం, ఎంజీపీ కూడా రంగంలోకి దిగితే ఈ ఓట్లు  చీలిపోతాయి. కమలదళం విజయానికి కీలకంగా మారిన ఈ ఓట్లు చీలితే కష్టం. మనోహర్ పారికర్ భౌతికంగా ఉండి ఉంటే, ఆరోగ్యం కుదుటపడి ఉంటే ఆయన బీజేపీని ముందుం డి నడిపించేవారు. ఆ ఓట్లను గంపగుత్తగా కైవసం చేసుకొనేవారు. కానీ ఆ పరిస్థితి లేదు.

2017లో ఏర్పడిన కొయిలేషన్ గవర్నమెంట్​లో భాగస్వామి అయిన ఎంజీపీ.. బీజేపీని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రస్తుతం లోక్ సభతోపాటు అసెంబ్లీ బైఎలక్షన్స్ లోనూ పోటీ చేస్తానంటోంది. రెం డు అసెంబ్లీ సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిం ది. మరో స్థానానికి త్వరలోనే డిక్లేర్ చేస్తామంది. దీంతో బీజేపీలో ఆందోళన మొదలైంది. 2017 ఎన్నికల్లో గోవా సురక్షా మంచ్ పెద్దగా రాణించకపోవటంతో ఆ పార్టీ చీఫ్​ సుభాష్ వెలింగ్ కర్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండటానికి అప్పట్లో ఇష్టపడలేదు. గతంలో గోవాలో ఆర్ఎస్ఎస్ కి అధిపతిగా వ్యవహరించిన ఆయనను రాష్ట్ర బీజేపీ పెద్దలకు రాజకీయ గురువుగా చెప్పుకుంటారు. దివంగత సీఎం మనోహర్ పారికర్ , ప్రస్తుత కేంద్ర ‘ఆయుష్ ’ మంత్రి శ్రీపాద్ నాయక్ , మాజీ సీఎం పర్సేకర్ తదితరులు సుభాస్ వెలిం గ్ కర్ శిష్యులే . స్టేట్​ పాలిటిక్స్ లో సీనియర్ మోస్ట్​ లీడర్ అయిన ఆయన జీఎస్ ఎంని లీడ్ చేస్తుండటంతో బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లు పడ్డట్లే. దీంతోపాటు బీజేపీకి రెబల్  క్యాండిడేట్​లా మారిన మరో లీడర్ మాజీ సీఎంలక్ష్మీకాంత్ పర్సేకర్ . మాంద్రెం అసెంబ్లీ స్థానంలో ఆయన్ని ఓడించటానికి కమల దళం దయానంద్ సోప్తేని సెలెక్ట్​ చేసింది.ఈ నేపథ్యంలో పర్సేకర్ .. మహారాష్ట్రవాదీ గోమంతక్  పార్టీ ప్రెసిడెంట్​ దీపక్ ధవాలికర్ తో ఇటీవల భేటీ అయ్యారు. దీంతో ఏం చేయాలో బీజేపీకి పాలుపోవట్లేదు. దీనికి తోడు షిరోదా అసెంబ్లీ నియోజకవర్గంలో కమలదళం అభ్యర్థిపై పోటీకి దీపక్ ధవాలికర్ఇప్పటికే క్యాండిడేట్​ను ప్రకటించారు. మరో రెండు చోట్ల కూడా ధీటైన వ్యక్తిని బరిలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. తమకు వ్యతిరేకంగా ఎంజీపీ అభ్యర్థులను నిలపదని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ వియన్ టెండూల్కర్ నమ్మకంగా ఉన్నారు.ఎంజీపీతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నామని చెబుతున్నారు. ఆందోళన పైకి కనిపిం చకుండా ఇలా కవర్ చేసుకుంటున్నారు.

బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాగిం చాలంటే ఎంజీపీ సపోర్ట్​ కీలకం. 2012లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయింది. పార్టీ బలం 21 సీట్ల నుంచి 13కి దిగజారింది. మరో వైపు.. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క క్యాండిడేట్​ను కూడా ప్రకటించలేదు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి బీజేపీపై విమర్శలకు దిగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళానికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తెగ ప్రయత్నించిం దని, ఈ ఎలక్షన్స్ లోనూ అదే అనుభవం ఎదురుకానుందని దెప్పిపొ డిచింది. ప్రభుత్వాన్ని  ఏర్పాటుచేయటానికి బీజేపీ అధికార దుర్విని యోగానికి పాల్పడిందని, అప్పుడు పంచన చేరినవారే ఇప్పుడు గుణపాఠాలు నేర్పుతున్నారని గుర్తుచేస్తోంది. గోవాలో పారికర్ లేని లోటు బీజేపీకి స్పష్టం గా కనిపిం చనుంది. ఆయన దూరం కావటంతో సానుభూతి పవనాలు వీస్తే తప్ప విజయం సాధ్యం కాదు.