స్వతంత్ర్య అభ్యర్థిగా పంజాబ్ సీఎం సోదరుడి నామినేషన్

స్వతంత్ర్య అభ్యర్థిగా పంజాబ్ సీఎం సోదరుడి నామినేషన్

చండీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ పోటీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. బస్సీ పఠానా స్థానం నుంచి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. రెండు వారాల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అది కాస్తా అసంతృప్తులకు తావిచ్చింది. ముఖ్యంగా మాన్సా, మోగా, మలౌట్, బస్సి పఠానా నియోజవర్గాల టిక్కెట్లు ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు బస్సీ పఠానా టిక్కెట్ లభించలకపోవడంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న సీఎం చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బస్సీ పఠానా నియోజకవర్గం టెక్కెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు. సోదరుణ్ని బుజ్జగించి పోటీ నుంచి విరమింపజేసేందుకు సీఎం చన్నీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.