స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

మనోహరాబాద్,వెలుగు; స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మనోహరాబాద్ మండలం బిజెపి అధ్యక్షుడు బక్కా వెంకటేశ్​ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వెంకటేశ్​ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు,పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ ని  ఇంటింటికి తీసుకెళ్లాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్​ల ఫోరం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్​, అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా,జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేందర్ చారి,మాజీ సర్పంచ్ ఐలయ్య, పురం మహేశ్, ప్రభాకర్ గౌడ్  పాల్గొన్నారు.