రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ

 రిటైర్మెంట్ ప్రకటించిన  టీమిండియా క్రికెటర్  మనోజ్ తివారీ

టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ 2023 ఆగస్టు 03 గురువారం రోజున అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ ఆటకు వీడ్కోలంటూ తివారీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాశాడు. తివారీ చివరిసారిగా 2015లో ఇండియా తరపున ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు.  

టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడిన తివారీ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో పాటు కింగ్స్ XI పంజాబ్, రైజింగ్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 26.09 సగటుతో 287 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 104గా ఉంది.  ఇక ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన తివారీ 28.72 సగటుతో 1,695 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. 

ALSO READ:వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ పట్టేసి టీ20ల వేటకు..మూడో వన్డేలో ఇండియా విక్టరీ

మనోజ్ తివారి ప్రస్తుతం  పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా  కొనసాగుతున్నారు.   కెరీర్ ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించిన మనోజ్ తివారీ.. టీమ్ ఇండియాలో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.  గత 8 ఏళ్లుగా మనోజ్ తివారీకి టీమిండియాలో చోటు దక్కలేదు