అంత కసి ఏంట్రా: ఓ మనిషిని ఏడు ముక్కలుగా నరికి.. బ్యాగులో పెట్టి.. బీచ్‎లో పడేసి..

అంత కసి ఏంట్రా: ఓ మనిషిని ఏడు ముక్కలుగా నరికి.. బ్యాగులో పెట్టి.. బీచ్‎లో  పడేసి..

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. శరీర అవయవాలను ప్లాస్టిక్ బ్యాగ్‎లో పెట్టి నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ముంబైలోని గోరై బీచ్‌లో పడేశారు. బీచ్‎లో అనుమానస్పదంగా బ్యాగ్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్‎కు గురి అయ్యారు. బ్యాగులో ముక్కలు ముక్కలుగా ఉన్న మనిషి బాడీ పార్ట్స్ చూసి ఖంగుతిన్నారు.

ALSO READ | Air Pollution: ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధించాలి: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

 ప్లాస్టిక్ బ్యాగ్‌లో మొత్తం ఏడు ముక్కలుగా శరీర అవయవాలు లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ సంచిలోంచి బయటపడిన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు సేకరించేందుకు బీచ్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.