మన్సూరాబాద్ అయ్యప్ప గుడిలోని హుండీ చోరీ

మన్సూరాబాద్ అయ్యప్ప గుడిలోని హుండీ చోరీ
  •     స్థానికులు వెంబడించడంతో వదిలేసి పరారైన దుండగులు

ఎల్బీనగర్, వెలుగు : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ అయ్యప్ప ఆలయంలో దొంగలుపడ్డారు. హుండీని ఎత్తుకెళ్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌవ్స్ వేసుకుని మంగళవారం తెల్లవారుజామున మన్సూరాబాద్ అయ్యప్ప ఆలయంలోకి వెనుక నుంచి చొరబడ్డాడు. ఆవరణలోని హుండీని ఎత్తుకుని బైక్​పై పారిపోతుండంగా అదే టైంలో అటుగా వచ్చిన స్థానిక యువకులు వెంబడించారు. కర్రలతో అడ్డగించేందుకు ప్రయత్నించారు.

నిందితుడు హుండీ, బైక్​ను వదిలేసి పారిపోయాడు. ఆలయ చైర్మన్ కేత సత్యప్రియ గురుస్వామి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, నాగోలు సీఐ సూర్యనాయక్  ఆలయాన్ని పరిశీలించారు. నిందితుడు వదిలేసిన బైక్ కొట్టేసినదేనని తెలిసింది. కాగా ఆలయంలోకి చొరబడిన వ్యక్తితోపాటు మరొక వ్యక్తి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.