నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తా : పుట మధు

మల్హర్, వెలుగు: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానని మంథని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి పుట మధు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని భూపాలపల్లి జడ్పీచైర్​పర్సన్​ జక్కు శ్రీహర్షిని రాకేశ్​తో  కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడారు.  

ఓటుకు నోటుతో ప్రజలను మభ్యపెట్టి , హైదరాబాద్ కే  పరిమితమయ్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు  కావాలో, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు.  కార్యక్రమంలో బీఆర్ఎస్  మండల అధ్యక్షులు కుంభం రాఘవరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షులు గోనె శ్రీనివాస రావు, పీఎసిఎస్ చైర్మన్ రామారావు, బీఆర్ఎస్  యూత్ మండలాధ్యక్షులు జాగరి హరీశ్ పాల్గొన్నారు.